అమ్మకు అభివందనం
నూరేళ్లు జీవించాలి
హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తన తల్లితో అనుబంధాన్ని పంచుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పాదాభివందనం చేశారు. కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి తినిపించారు. తనను ఇంత వాడిని చేసినందుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించామని, ఈ ప్రయాణంలో తనతో పాటు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎదగడానికి తల్లి ఎంతో కీలకమైన పాత్ర పోషించిందన్నారు మెగాస్టార్. లక్షలాది మంది ఆదరాభిమానాలు ఉన్నాయంటే దీనికి ప్రధాన కారణం అమ్మేనని కొనియాడారు.
తాము అంతు లేని ఆనందాన్ని పొందుతున్నామని తెలిపారు. ఇవాళ భౌతికంగా మా మధ్యన తండ్రి లేరు. కానీ తమ తల్లి మా మధ్య ఉండటం అదృష్టమని, దీనిని మాటల్లో చెప్పలేనంటూ పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇదిలా ఉండగా తాను ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.