వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకు వస్తాం – షా
ఆరు నూరైనా ఆగదన్న కేంద్ర మంత్రి
ఢిల్లీ – బీజేపీ ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి స్పందించారు. ఆరు నూరైనా సరే బిల్లు ఆగదని ప్రకటించారు.
మెజారిటీ సభ్యుల బలం తమకు ఉందని, ఇండియా కూటమికి చెందిన పార్టీలు అరిచి గోల చేసినా ఆగేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఈ విషయంలో అని చెప్పారు అమిత్ చంద్ర షా.
వక్భ్ బోర్డు బిల్లుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే చెప్పాలే కానీ అనవసరంగా రాద్దాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
అయినా సరైన బలం లేని వాళ్లే , ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారే ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ మండిపడ్డారు. తమ సర్కార్ కచ్చితంగా వక్భ్ బోర్డు బిల్లును తీసుకు వచ్చి తీరుతుందని మరోసారి కుండ బద్దలు కొట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి. బీజేపీ ట్రబుల్ షూటర్. దీనిసై తీవ్ర అభ్యంతరం తెలిపాయి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు.