NEWSANDHRA PRADESH

కేంద్ర మంత్రుల‌కు ష‌ర్మిల ఘాటు లేఖ

Share it with your family & friends

ఏపీ స‌మ‌స్య‌ల‌పై తాత్సారం ఎందుకు

విజ‌య‌వాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్, మ‌న్సూఖ్ మాండ‌వీయ‌కు శుక్ర‌వారం లేఖ‌లు రాశారు. సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో ఈపీఎస్ 95 పింఛనర్ల ప్రయోజనాలపై వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.

కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఎందుకు తాత్సారం వ‌హిస్తున్నారో కేంద్ర స‌ర్కార్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఇది ప్రపంచంలోనే క్లయింట్ల సంఖ్య, ఆర్థిక లావాదేవీలు పరంగా అతిపెద్ద సంస్థగా గుర్తించ బ‌డింద‌న్న విష‌యం గుర్తు చేశారు. పింఛనర్లు తగినంత పింఛన్లు అందక బాధకు గురవుతున్నారని ఆవేద‌న చెందారు.

1990లలో ప్రవేశ పెట్టిన ఈ పథకం కాలక్రమేణా తగ్గి పోయిందని వాపోయారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.రిటైర్ అయిన వారి నుండి రుసుములు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయ‌ని పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్‌.

గ‌త‌ సంవత్సర కాలంగా పింఛన్లు విడుదల చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. వృద్దుల సంక్షేమం ప‌ట్ల నిరాద‌ర‌ణ మంచిది కాద‌ని పేర్కొన్నారు. మరి మోదీ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థత లేదా? అసలు బాధ్యత ఎవరిదీ? అంటూ మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.