సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కేనా
ఇంగ్లండ్ తో రెండో టెస్టు
ముంబై – బీసీసీఐ కొందరి ఆటగాళ్ల పట్ల ఏ మాత్రం దయ చూపడం లేదు. దేశీవాలి పోటీలలో అద్భుతంగా రాణించినా వారిని పక్కన పెట్టడం విస్తు పోయేలా చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ అనుసరిస్తున్న తీరును, ప్రతిభ కలిగిన ఆటగాళ్ల పట్ల కక్ష సాధింపు ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాకు చెందిన యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కాక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
వివక్షకు గురవుతున్న వారిలో ప్రధానంగా కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ఉండగా మరో ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆ జాబితాలోకి చేరాడు. మనోడు దేశీవాలి మ్యాచ్ లలో సత్తా చాటాడు. సెంచరీలతో కదం తొక్కాడు. కానీ టెస్టు జట్టుకు అతడిని పరిగణలోకి తీసుకోక పోవడంపై అభిమానులు మండి పడుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఊహించని పరిణామం. ఇంగ్లండ్ స్పిన్నర్ ధాటికి బ్యాటర్లు పరుగులు చేయలేక తల్లడిల్లారు. వికెట్లు పారేసుకున్నారు. ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్, సంజూ శాంసన్ ఉంటే బావుండేదని అంటున్నారు ఫ్యాన్స్. మరి రెండో టెస్టు కైనా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తే బావుంటుంది.