SPORTS

సంజూ శాంస‌న్..తిల‌క్ వ‌ర్మ రికార్డ్

Share it with your family & friends

210 ప‌రుగుల భాగ‌స్వామ్యం

జోహెన‌స్ బ‌ర్గ్ – ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన కీల‌క‌మైన 4వ టి20 మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది. భార‌త బ్యాట‌ర్ల ధాటికి స‌ఫారీలు విల విల లాడారు. ఎక్క‌డ ఎవ‌రికి బౌలింగ్ చేయాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకున్నారు. స్కిప్ప‌ర్ అయితే చూస్తూ ఉండి పోయాడు.

అభిషేక్ శ‌ర్మ రెచ్చి పోయి ఆడితే కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ వీర విహారం చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తెలుగు కుర్రాడు తెగించి ఆడాడు. ఈ ముగ్గురు క‌లిసి భార‌త జ‌ట్టుకు భారీ స్కోర్ సాధించి పెట్టారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించారు. క్రికెట్ ఫ్యాన్స్ కు టి20 ఆట‌లో ఉన్న మ‌జాను మ‌రోసారి రుచి చూపించారు.

ఈ మ్యాచ్ లో ప‌లు రికార్డులు న‌మోద‌య్యాయి. సంజూ శాంస‌న్ ప్ర‌పంచ రికార్డ్ న‌మోదు చేశాడు. టి20 ఫార్మాట్ లో ఏకంగా మూడు సెంచ‌రీలు చేయ‌డం, వికెట్ కీప‌ర్ గా అరుదు. అంతే కాదు ఈ మ్యాచ్ లో ఇద్ద‌రు భార‌త క్రికెట‌ర్లు సెంచ‌రీల మోత మోగించారు. ఇక రికార్డ్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఏకంగా 2వ వికెట్ కు 210 ప‌రుగులు జోడించారు. సంజూ శాంస‌న్ 109 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే తిల‌క్ వ‌ర్మ 120 ప‌రుగుల‌తో క్రీజులో నిలిచాడు.