SPORTS

ఫ్యాన్ ను గాయ‌ప‌ర్చిన శాంస‌న్ సిక్స‌ర్

Share it with your family & friends

మ్యాచ్ త‌ర్వాత ప‌రామ‌ర్శించిన సంజూ

జోహ‌నెస్ బ‌ర్గ్ – ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన 4వ టి20 మ్యాచ్ లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. సంజూ శాంస‌న్ జోరు మీదున్నాడు. ఆట‌లో భాగంగా త‌ను అద్భుత‌మైన సిక్స్ కొట్టాడు. అది బౌండ‌రీ లైన్ అవ‌త‌ల ప‌డింది. నేరుగా స్టేడియం గ్యాల‌రీలో కూర్చున్న మ‌హిళా అభిమానికి తాకింది. దీంతో ఆమె విల విల‌లాడింది.

పెద్ద‌గా గాయం కాక పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా స్క్రీన్ మీద తాను కొట్టిన సిక్స్ కార‌ణంగా ఫ్యాన్ గాయ‌ప‌డింది చూశాడు సంజూ శాంస‌న్ . త‌ను అద్భుతంగా ఆడాడు. 6 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 51 బంతుల‌లో 109 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌న‌తో పాటు హైద‌రాబాద్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ 120 ప‌రుగులు చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు.

అనంత‌రం భారీ టార్గెట్ ఛేద‌నలో బ‌రి లోకి దిగిన స‌ఫారీ జ‌ట్టు చేతులెత్తేసింది. అర్ష్ దీప్ బౌలింగ్ దెబ్బ‌కు విల లాడారు ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్లు. కేవ‌లం 20 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జ‌ట్టు గెలుపొందిన అనంత‌రం సంజూ శాంస‌న్ నేరుగా స్టేడియం గ్యాల‌రీ వ‌ద్ద‌కు వెళ్లాడు. త‌ను కొట్టిన షాట్ కార‌ణంగా గాయ‌ప‌డిన ఫ్యాన్ ను ప‌ల‌క‌రించాడు. ఆమెకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. పెద్ద గాయం అయితే దానికి అయ్యే ఖ‌ర్చు కూడా తాను భ‌రిస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో ఫ్యాన్ సంజూను మ‌రిచి పోలేనంటూ పేర్కొంది.