వెల్ డన్ బాయ్స్ – జే షా
భారత జట్టుకు కంగ్రాట్స్
ముంబై – బీసీసీఐ కార్యదర్శి, ఐసీసీ చైర్మన్ జే షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా జరిగిన టి20 సీరీస్ లో 3-1 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క ఆటగాడు అంచనాలకు మించి ఆడారాని, ఇదే స్పూర్తితో రాబోయే సీరీస్ లలో మంచి ప్రదర్శన చేపడతారని, భారత దేశానికి పేరు తీసుకు వస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా సెంచరీలతో కదం తొక్కిన కేరళ స్టార్ సంజూ శాంసన్ , తెలుగు కుర్రాడు తిలక్ వర్మలను అభినందనలతో ముంచెత్తారు జే షా. అంతే కాదు తన సూపర్ బౌలింగ్ తో సఫారీల వెన్ను విరిచి, టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన అర్ష్ దీప్ సింగ్ కు కంగ్రాట్స్ తెలిపారు.
టి20 ఫార్మాట్ లో రికార్డుల మోత మోగించినందుకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు , తన టీం సభ్యులందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఐసీసీ చైర్మన్ జే షా. ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐపీఎల్ వల్ల ఎంతో టాలెంట్ కలిగిన కుర్రాళ్లు బయటకు వస్తున్నారని, తాము చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తోందని, ఇందుకు జట్టు ఆడుతున్న తీరే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు జే షా.