భావోద్వేగానికి లోనైన కేరళ స్టార్
సఫారీలకు సంజూ శాంసన్ షాక్
జోహనెస్ బర్గ్ – దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక 4వ టి20 మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. భారీ తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ, సంజూతో పాటు తిలక్ వర్మ దుమ్ము రేపారు. ఈ సీరీస్ లో తొలి మ్యాచ్ లో షాన్ దార్ సెంచరీతో దంచి కొట్టిన శాంసన్ ఉన్నట్టుండి 2,3వ టి20 మ్యాచ్ లలో సున్నాకే వెనుదిరిగాడు. దీంతో ఆఖరి మ్యాచ్ లో ఎలా ఆడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎక్కడా వెనుదిరగకుండా చూడలేదు. తిలక్ వర్మతో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు సంజూ శాంసన్. 109 రన్స్ చేసి క్రీజులో నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. వర్మ 10 సిక్సర్లు 9 ఫోర్లు ఉన్నాయి.
2వ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది ఓ రికార్డు. సంజూ శాంసన్ , తిలక్ వర్మ కలిసి 210 రన్స్ చేశారు. టి20 ఫార్మాట్ లో ఇది అరుదైన రికార్డ్ కావడం విశేషం. ఇక కేరళ స్టార్ 5 మ్యాచ్ లలో మూడు సెంచరీలు సాధించాడు. 22 సిక్సర్లు 17 ఫోర్లు నమోదయ్యాయి ఈ మ్యాచ్ లో . మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన జీవితంలో వైఫల్యాలు, ఎత్తు పల్లాలు ఉన్నాయని పేర్కొన్నాడు .
ప్రస్తుతం సెంచరీ చేయడం, అజేయంగా నిలవడం తనను మరింత సంతోషానికి లోను చేసిందన్నాడు సంజూ శాంసన్.