DEVOTIONAL

శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

Share it with your family & friends

పెద్ద ఎత్తున హాజ‌రైన మ‌హిళా భ‌క్తులు

తిరుపతి – తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పుర‌స్క‌రించుకుని అన్నాభిషేకం ఘనంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వహించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు.

తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన, శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.