నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంట విషాదం నెలకొంది. ఆయన స్వంత సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తీవ్ర అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. తన చిన్నాన్న ఇక లేరన్న విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్ హుటా హుటిన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు విచ్చేశారు. మరో వైపు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారన్న విషయం తెలియగానే వెంటనే హైదరాబాద్ కు బయలు దేరి వెళ్లారు. అయితే రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ నటుడిగా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా సీఎం సోదరుడు 1994 నుంచి 1994 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పని చేశారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందారు.
1999లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో గల్లా అరుణ కుమారిపై పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేక పోవడంతో పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. రామ్మూర్తి నాయుడు 1952లో పుట్టారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒకరు హీరో మరొకరు ఇతర పనులు చూసుకుంటారు.
సోదరుడు ఇక లేరని తెలిసి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఆయన అన్ని పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఆదివారం స్వంత ఊరు నారా వారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.