సిక్సర్ల వేటలో సంజూ శాంసన్ టాప్
2024లో టి20లలో కేరళ స్టార్ టాప్
హైదరాబాద్ – దక్షిణాఫిక్రా టూర్ ముగిసింది. భారత్ 3-1 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది. కేవలం 5 మ్యాచ్ లలో కేరళ స్టార్ సంజూ శాంసన్ 3 సెంచరీలు సాధించాడు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ లో తొలి క్రికెటర్ గా నమోదు చేశాడు.
ఈ ఏడాదిలో జరిగిన టి20 మ్యాచ్ లలో మొత్తం 10 మ్యాచ్ లు ఆడాడు సంజూ శాంసన్. ఏకంగా 22 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ , యశస్వి జైశ్వాల్ , రింకూ సింగ్ సిక్సర్లు కొట్టేందుకు నానా తంటాలు పడ్డారు.
11 మ్యాచ్ లలో రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టాడు. కానీ సంజూ శాంసన్ స్ట్రైక్ రేట్ అందరి కంటే సంజూ శాంసన్ కు ఎక్కువగా ఉండడం విశేషం. టి20 ఫార్మాట్ లో మూడు శతకాలు బాదడం మామూలు విషయం కాదు.
హైదరాబాద్ లో జరిగిన టి20 మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు సంజూ శాంసన్. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్ లో భాగంగా తొలి టి20లో సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా 4వ టి20 మ్యాచ్ లో షాన్ దార్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. శతకంతో దుమ్ము రేపాడు. 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.