NEWSTELANGANA

ప్ర‌గ‌తి ప‌థం తెలంగాణ రాష్ట్రం – టీపీసీసీ చీఫ్

Share it with your family & friends

తెలంగాణ రైజింగ్ పేరుతో ముమ్మ‌ర ప్ర‌చారం

హైద‌రాబాద్ – టీపీసీసీ అధ్య‌క్షుడు బొమ్మ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరిక తెలంగాణ అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌గ‌తి ప‌థం ముందుకు క‌దులుతోంద‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉన్నార‌ని తెలిపారు.

కానీ గత 10 ఏళ్ల కాలంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని వాపోయారు. త‌మ ప్ర‌భుత్వం విద్య‌, ఆరోగ్య‌, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై ఎక్కువ‌గా దృష్టి సారించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు టీపీసీసీ చీఫ్‌.

ఈ ఐదేళ్లే కాదు వ‌చ్చే ఐదేళ్లు కూడా తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బొమ్మ మ‌హేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం అని పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్ అనేది కాంగ్రెస్ సిద్ధాంతం అన్నారు. రాహుల్ గాంధీ పురోగతి, సాధికారత , సమానత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు టీపీసీసీ అధ్య‌క్షుడు.

బీఆర్ఎస్ పార్టీ స‌ర్కార్ కింద దశాబ్దం పాటు స్తబ్దతతో ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రజాపాలన కింద తన అంతర్భాగంలో సమగ్రత, ఆవిష్కరణలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

విద్య నుండి వ్యవసాయం వరకు, వైద్యం నుండి ఉపాధి వరకు, పారదర్శకత ఉండేలా ప్ర‌భుత్వం చూస్తోంద‌న్నారు.