నైజీరియా ప్రభుత్వం మోడీకి అరుదైన గౌరవం
ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారం
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి అరుదైన గౌరవం దక్కనుంది. ఈ మేరకు ఆదివారం నైజీరియా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ దేశంలో అత్యున్నతమైన అవార్డుగా భావించే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ (జీసీఓఎన్) పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా తన ఉత్తర్వులలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. దేశాధినేతలు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు పాలనా పరంగా తీసుకున్న చర్యలు, దేశానికి అందించిన సేవలు, అంతర్జాతీయ పరంగా శాంతి, సామరస్యం కోసం చేసిన కృషికి సంబంధించి నైజీరియా ప్రభుత్వం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అవార్డుతో సత్కరిస్తుంది.
ఈ అవార్డును తాజాగా మోడీకి ప్రకటించడం సంతోషం. ఇదిలా ఉండగా 1969లో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఇతర విదేశీ ప్రముఖులలో ఇంగ్లండ్ కు చెందిన క్లీన్ ఎలిజబెత్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి పురస్కారం దక్కింది. కాగా మోడీకి అంతర్జాతీయ పరంగా అందుకున్న అవార్డులలో దీనితో కలుపుకుంటే ఇప్పటి వరకు 17 పురస్కారాలు దక్కాయి. ఇది మోడీ అత్యున్నతమైన నాయకత్వ నైపుణ్యానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు.