కిషన్ రెడ్డి బస్తీ నిద్ర
బాధితులకు భరోసా
హైదరాబాద్ – కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో భాగంగా పేదల ఇండ్లను కూలగొడుతున్న నేపథ్యంలో అక్కడి బస్తీ వాసులకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో దీనిని చేపట్టినట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి.
స్థానిక మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించి బీజేపీ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా పేద ప్రజల ఇండ్లకు కాపలాగా తాము కాపలాగా ఉంటామని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడడ్ఇ.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్ వేశారు కేంద్ర మంత్రిపై.
కొత్త పరుపు , కొత్త బెడ్ షీట్ , కాళ్లకు సాక్సులు, వీటికి తోడు కెమెరామెన్ తో 20 నిముషాల నిద్రతో వారి సమస్యలను ముందే ఊహించినట్లున్నారంటూ పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంత వాసులకు నాణ్యమైన సాక్సులు, దోమలు ఎప్పుడు కుడుతున్నాయో తెలుసుకునేందుకు ఇంటికో కెమెరామెన్ ను ఏర్పాటు చేస్తే బెటర్ అంటూ సూచించారు.