మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
చంద్రబాబుపై అనుచిత కామెంట్స్ చేశారని
విశాఖపట్నం – మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని త్రీ టౌన్ లో కొడాలి నానిపై లా చదువుతున్న విద్యార్థి ప్రియ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొడాలి నానిపై కేసేఉ నమోదు చేశారు.
తెలుగుదేశం పార్టీ చీఫ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనరాని మాటలు అన్నారంటూ , కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు సదరు విద్యార్థి.
ఈ మేరకు కొడాలి నానిపై ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు త్రీ టౌన్ పోలీసులు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇదంతా కావాలని చేస్తున్నారంటూ వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయినా భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఆయన భార్య, కొడుకు లోకేష్ పై సభ్య సమాజం తల దించుకునేలా కామెంట్స్ చేశారు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తదితరులు.