సీఎంను కాపాడుతున్న కమలదళం – కేటీఆర్
దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమ దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తోడు దొంగల నాటకం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
అంతా అయి పోయాక కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. మూసీ బాధితుల గురించి మాట్లాడటం, భరోసా ఇస్తా అనడం మరింత ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు.
కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనను మరిచి పోయేందుకు, దాని నుంచి సీఎం రేవంత్ రెడ్డిని రక్షించేందుకు బస్తీ నిద్ర పేరుతో మరో రాజకీయానికి తెర లేపారంటూ ధ్వజమెత్తారు కేటీఆర్. కేంద్ర మంత్రికి మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు.
హైడ్రాను మొదట స్వాగతించింది మీరు కాదా అని నిలదీశారు కేంద్ర మంత్రిని . బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది తామేనని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి? అంటూ మండిపడ్డారు.
రేవంత్ ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు అంటూ ఎద్దేవా చేశారు.