బాలా సాహెబ్ ఠాక్రే నాకు ఆదర్శం
ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్
మహారాష్ట్ర – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అక్కడ శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. అంతకు ముందు ఆదివారం భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా హాజరైన ప్రజలకు అభివాదం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఈసారి కూడా మరాఠాలో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. దీనిని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్.
ఈ దేశాన్ని సర్వ నాశనం చేసింది చాలక తిరిగి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు . వారికి అంత సీన్ లేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు.
తనకు బాలా సాహెబ్ ఠాక్రే అంటే ఇష్టమని, ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. చంద్రాపూర్ జిల్లా బల్లార్ పూర్ నియోజకవర్గంలో పర్యటించారు.