భారత్ నైజీరియాల మధ్య బంధం – మోడీ
అత్యున్నత పురస్కారం దక్కడం సంతోషం
నైజీరియా – భారత దేశం, నైజీరియా మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ప్రస్తుతం ప్రధాన మంత్రితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా నైజీరియా ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాన్ని ప్రధానమంత్రి మోడీకి ప్రకటించింది. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నైజారీయా ప్రెసిడెంట్ కు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు .
అంతకు ముందు ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. కీలకమైన అంశాల పట్ల చర్చించారు . అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు . ఇదే సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు
అధ్యక్షుడు టినుబుతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని చెప్పారు మోడీ. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపందు కోవడం గురించి చర్చించామన్నారు. ప్రధానంగా రక్షణ, ఇంధనం, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, విద్య, మరిన్ని రంగాలలో సంబంధాలు మరింతగా వృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు మోడీ.