బాబు..పవన్ లు ఇక ఇంటికే
ఏపీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లిగూడెం – ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరూ ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వారు కలల్లో తేలి పోతున్నారని , వారికి అంత సీన్ లేదన్నారు.
బాబు, పవన్ , లోకేష్ లు తోడు దొంగలని ఆరోపించారు. వారిని జనం పట్టించుకునే స్థితిలో లేరన్నారు. జగన్ రెడ్డి సంక్షేమ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇవాళ ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించారు.
చంద్రబాబు శరీరంలో ఉన్నదంతా విషం తప్పా ఇంకేమీ లేదన్నారు. విష పూరితమైన తాచు పాములు సైతం బాబు ముందు దిగ దిడుపేనంటూ ఎద్దేవా చేశారు. జగన్ అర్జునుడిలా మరోసారి జెండా ఎగుర వేయబోతున్నారంటూ జోష్యం చెప్పారు అంబటి రాంబాబు.
ఆనాడు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చారని, కానీ జగన్ వచ్చాక ఏపీని సంక్షేమ రాజ్యంగా మార్చిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని లేక పోతే జనం ఈసడించే రోజు తప్పకుండా వస్తుందన్నారు.