మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి
మిలిటెంట్ గ్రూప్ లకు డెడ్ లైన్
మణిపూర్ – మణిపూర్ మండుతోంది. ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పౌర సమాజం. ప్రధానంగా సాయుధ మిలిటెంట్ గ్రూపుల ఆగడాల నుంచి తమను రక్షించాలని కోరింది.
సాయుధ మిలిటెంట్ గ్రూపులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ పౌర సమాజ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం జారీ చేశాయి.
మణిపూర్‌లో జిరిబామ్‌లో మహిళలు, చిన్నారులు సహా ఆరుగురు మృతదేహాలు కనిపించడంతో హింస చెలరేగింది. సీఎం బీరెన్ సింగ్ అల్లుడు సహా పలువురు ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
ఇంఫాల్ లోయలో కర్ఫ్యూ విధించారు. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపి వేశారు. మణిపూర్ ప్రభుత్వం కూడా ప్రభావిత ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఏను సమీక్షించాలని అభ్యర్థించింది.
పరిస్థితిని చూసేందుకు హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేశారు. సీఎం బీరెన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.