ENTERTAINMENT

గ్రాండ్ గా పుష్ప‌2 మూవీ ట్రైల‌ర్ లాంచ్

Share it with your family & friends

పాట్నాలో పోటెత్తిన సినీ అభిమానులు

హైద‌రాబాద్ – డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రైజింగ్ స్టార్ అల్లు అర్జున్ , నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరు పొందిన ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప 2 సీక్వెల్ మూవీకి సంబంధించి ట్రైల‌ర్ ఆదివారం గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాట్నా వేదిక‌గా దీనిని ఏర్పాటు చేశారు.

వేలాది మంది ఈవెంట్ ను చూసేందుకు వ‌చ్చారు. దేశ వ్యాప్తంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన పుష్ప 2 మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు దాదాపు రూ. 500 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ముంద‌స్తుగానే భారీ అంచ‌నాలు నెల‌కొన‌డంతో రూ. 1,000 కోట్లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాగా ఇక్క‌డ‌ ఇంత గ్రాండ్ ఈవెంట్ జరగడం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ కార్యక్రమానికి నగరంలోని గాంధీ మైదాన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు.

బీహార్ ప్రభుత్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఇంత భారీ భద్రతా బలగాలను మోహరించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తుంటే పాన్ ఇండియా స్టార్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ఉత్తరప్రదేశ్ ఇక్క‌డ అంతే క్రేజ్ కనిపిస్తోంది.

అయితే వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా పుష్ప 2 మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.