దుమ్ము రేపుతున్న పుష్ప2 ట్రైలర్
రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సెన్సేషపన్
బీహార్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ రికార్డు మోత మోగిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన పుష్ప2 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పు కోవల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్. ఆయన అందించిన సంగీతం దుమ్ము రేపుతోంది. యూత్ గుండెలను మీటుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చార్ట్ లో నెంబర్ వన్ లో ఉన్నాయి. శ్రేయా ఘోషల్ పాడిన పాట గుండెలను మీటుతోంది.
ఇక తెలుగులో చంద్రబోస్ రాసిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పుష్ప పుష్ప అంటూ పాడిన పాటతో పాటు శ్రేయా పాడిన సాంగ్ ఆకట్టుకుంటోంది.
బీహార్ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ బందోబస్తు మధ్య బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప2 మూవీ ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ చౌహాన్ విచ్చేశారు.
ఈ సందర్బంగా మరోసారి శ్రీవల్లి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా రిలీజ్ కాకుండానే పుష్ప 2 మూవీ వసూళ్లలో రికార్డుల మోత మోగించడం విశేషం. ఇప్పటికే రూ. 1000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.