ENTERTAINMENT

బ‌న్నీ.. శ్రీ‌వ‌ల్లి కెమిస్ట్రీ సూప‌ర్

Share it with your family & friends


పుష్ప‌2 మూవీ మ‌రోసారి రికార్డ్
బీహార్ – మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన పుష్ప 2 మూవీ ట్రైల‌ర్ రికార్డు మోత మోగిస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. రూ. 500 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి నిర్మించిన పుష్ప‌2 చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మ‌రోసారి అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ పోటెత్తారు. ఎక్క‌డ చూసినా అభిమానులే క‌నిపించారు. సినిమాకు సంబంధించి ఇద్ద‌రి కెమిస్ట్రీ సూప‌ర్ గా కుదిరింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ప్ర‌త్యేకంగా చెప్పు కోవ‌ల్సింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్. ఆయ‌న అందించిన సంగీతం దుమ్ము రేపుతోంది. యూత్ గుండెలను మీటుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. చార్ట్ లో నెంబ‌ర్ వ‌న్ లో ఉన్నాయి. శ్రేయా ఘోష‌ల్ పాడిన పాట గుండెల‌ను మీటుతోంది.

ఇక తెలుగులో చంద్ర‌బోస్ రాసిన పాట‌లు సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. పుష్ప పుష్ప అంటూ పాడిన పాట‌తో పాటు శ్రేయా పాడిన సాంగ్ ఆక‌ట్టుకుంటోంది.