వారెవ్వా శ్రీవల్లి సూపర్
పుష్ప 2 మూవీ ట్రైలర్
బీహార్ – పుష్ప 2 మూవీ ట్రైలర్ ఘనంగా లాంచ్ అయ్యింది. బీహార్ పాట్నా రాజధాని వేదికగా ఈ కార్యక్రమంగా అంగరంగ వైభవం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 మూవీ ట్రైలర్ రికార్డు మోత మోగిస్తోంది.
ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన పుష్ప2 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరోసారి అల్లు అర్జున్ , రష్మిక మందన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక శ్రీవల్లిగా పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మనసు దోచుకునేలా నటించింది.
ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ పోటెత్తారు. ఎక్కడ చూసినా అభిమానులే కనిపించారు. సినిమాకు సంబంధించి ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ గా కుదిరింది. ఈ సినిమా అభిమానులను సంతృప్తి చెందేలా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదన్నారు బన్నీ.
పుష్పరాజ్ లో దుమ్ము రేపిన బన్నీ సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 మూవీలో తనదైన స్టైల్ లో ఆకట్టుకునేలా నటించాడు. మరోసారి తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. అంచనాలకు మించి తన నటన ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు దర్శకుడు సుకుమార్. భారత దేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో మూవీ ఉండడం ఖాయమని స్పష్టం చేశారు బన్నీ కూడా.