పీఎంకు లేఖ రాసిన షర్మిల
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
అమరావతి – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీ బాగు కోసం ఇప్పటికే ప్రకటించిన హామీలు ఎందుకు నెరవర్చ లేదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పీఎంకు ఉందన్నారు . ఏపీ విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను, పంపకాలను ఎందుకు ఇప్పటి వరకు పరిష్కరించ లేక పోయారో దానికి గల కారణాలేవో చెప్పాలన్నారు.
ఏపీ రాష్ట్రం బాగు కోసం, భవిత కోసం , నాటి కాంగ్రెస్ పొందు పర్చిన వాగ్ధానాలను అమలు పర్చాలన్నారు.
రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అసంపూర్ణ వాగ్ధానాలను పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ప్రసంగించే రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందు పర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
వాటిపై ఎన్నికల కంటే ముందే చర్యలు చేపట్టాలని కోరారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక చారిత్రక అవసరంగా గుర్తించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. కానీ ఏపీకి సంబంధించి పంపకాల విషయంలో, నిధుల మంజూరీలో వివక్ష చూపడం బావ్యం కాదని వాపోయారు.