ENTERTAINMENT

అల్లు అర్జున్ పుష్ప‌2 టీ ష‌ర్ట్ వైర‌ల్

Share it with your family & friends

గ్రాండ్ గా మూవీ ట్రైల‌ర్ రిలీజ్

బీహార్ – సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప‌2 ది రూల్ చిత్రం ట్రైల‌ర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బీహార్ రాజ‌ధాని పాట్నా వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వేలాదిగా ఫ్యాన్స్ త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది . విడుద‌ల‌య్యాక ఇంకెన్ని రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చెప్ప‌లేం అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఇక పుష్ప 2 ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్బంగా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు న‌టుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . ఆయ‌న పుష్ప 2 పేరుతో ఉన్న టీ ష‌ర్ట్ ను వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

మొత్తంగా భారీ అంచ‌నాల‌తో బ‌న్నీ ఫ్యాన్స్ ఉన్నారు. మ్యూజిక్ ప‌రంగా ఇప్ప‌టికే టాప్ లో కొన‌సాగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇక బ‌న్నీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.