DEVOTIONAL

తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడండి

Share it with your family & friends

శ్రీ స‌త్యాత్మ తీర్థ స్వామీజీ ఉప‌దేశం

తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తులకు ఇల‌వేల్పుగా మారి పోయిన క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌లు కొలువైన తిరుమ‌ల ప‌విత్ర పుణ్య క్షేత్రం ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు ఉత్తరాధి మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ.

తిరుమలలో ఉత్తరాధి మఠానికి విచ్చేసిన స్వామీజీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న‌తో పాటు కూడా స‌తీమ‌ణి ఉన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ చైర్మ‌న్ దంప‌తుల‌కు ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. స్వామీజీ ఆశీర్వ‌చ‌నం అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు బీఆర్ నాయుడు. ధర్మ ప్రచారాన్మి మరింత విస్తృతం చేయడంతో పాటు… వివాదాలకు తావు లేకుండా నూతన పాలక మండలి వ్యవహారించాలని స్వామిజీ సూచించారు.

నిత్యం వేలాది మంది తిరుమ‌ల కొండ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు ఉత్తరాధి మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ.