NEWSNATIONAL

ప్ర‌ధానిపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆగ్ర‌హం

Share it with your family & friends

మ‌ణిపూర్ లో బీజేపీ స‌ర్కార్ వైఫ‌ల్యం

మ‌హారాష్ట్ర – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ణిపూర్ లో చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ వైపు సామాన్య ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నా మ‌ణిపూర్ లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఖ‌ర్గే కొల్హాపూర్ లో మీడియాతో మాట్లాడారు.

మ‌ణిపూర్ మండుతోంద‌ని, గ‌త కొంత కాలంగా శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఖ‌ర్గే. ప్ర‌స్తుతం రాజ‌కీయ సంక్షోభం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి నెల‌కొన‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌న్నారు.

ఇంత జ‌రుగుతున్నా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్పందించ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఖ‌ర్గే. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న పీఎం సంద‌ర్శించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా మ‌ణిపూర్ బీజేపీ ప్ర‌భుత్వానికి ఇంత కాలం మ‌ద్ద‌తిస్తూ వ‌చ్చిన నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ చీఫ్ క‌న్రాడ్ సంగ్మా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము మ‌ద్ద‌తు ఉప సంహ‌రించు కుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.