NEWSNATIONAL

ముఖ్య‌మంత్రి రేసులో నేను లేను – సీఎం

Share it with your family & friends

ఏక్ నాథ్ షిండే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

మ‌హారాష్ట్ర – మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈసారి తాను సీఎంగా ఉండబోనంటూ ప్ర‌క‌టించారు. సీఎం రేసులో తాను లేన‌ని స్ప‌ష్టం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపిందిన ఆయ‌న చేసిన కామెంట్స్.

ప్ర‌స్తుతం మ‌రాఠాలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎన్డీయే ప్ర‌భుత్వం కొలువు తీరింది. శివ‌సేన లో ఉన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశాడు. కొంద‌రు ఎమ్మెల్యేల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తుతో మ‌రాఠా సీఎంగా కొలువు తీరాడు. చాలా కామ్ గా ప‌ని చేసుకుంటూ వ‌స్తున్నాడు.

ప్ర‌స్తుతం త‌న‌ను బీజేపీ ఎంపిక చేయ‌క పోవ‌చ్చ‌ని అంచ‌నా వేశాడు. ఇందులో భాగంగానే తాను సీఎం రేసులో లేనంటూ ప్ర‌క‌టించి ఉంటాడ‌ని స‌మాచారం. మ‌రో వైపు షిండేతో పాటు ముఖ్య‌మంత్రి రేసులో తాము కూడా లేమంటూ ప్ర‌క‌టించారు అజిత్ ప‌వార్, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

ఈసారి ఎన్నిక‌లు హోరా హోరీగా కొన‌సాగుతున్నాయి. ఒక‌వేళ ఎన్డీయే స‌ర్కార్ తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఎవ‌రు సీఎం అవుతార‌నేది ఉత్కంఠ‌గా మారింది.