NEWSNATIONAL

మ‌రాఠాకు అన్యాయం గుజ‌రాత్ కు అంద‌లం

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రిపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

మ‌హారాష్ట్ర – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీపై నిప్పులు చెరిగారు. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌స్తుతం శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.

మహారాష్ట్ర నుంచి 17కి పైగా పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టులు లాక్కొని నరేంద్ర మోదీ గుజరాత్‌కు మళ్లించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రాఠాలో ఉన్న వ‌న‌రుల‌ను ధ్వంసం చేశార‌ని వాపోయారు. దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని పేర్కొన్నారు.

మ‌రో వైపు మోడీ, అదానీలు మహారాష్ట్రలో పరిశ్రమలను కబ్జా చేయాలని చూస్తున్నా ప్రజలు అవకాశం ఇవ్వడం లేదని స్ప‌ష్టం చేశారు. మ‌రాఠా రాష్ట్రాన్ని ప‌ట్టించు కోవ‌డం లేద‌ని, దానిని నిర్ల‌క్ష్యం చేశార‌ని, గుజ‌రాత్ రాష్ట్రానికి ప్ర‌యారిటీ ఇస్తున్నార‌ని ఆవేద‌న చెందారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి.

ఈసారి మ‌రాఠాలో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.