DEVOTIONAL

ట్రంప్ వ‌ల్ల భార‌త్ కు ఒరిగేది ఏమీ ఉండ‌దు

Share it with your family & friends

అవిముక్తేశ్వ‌రానంద స‌రస్వ‌తి షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ – ప్ర‌ముఖ భార‌తీయ ఆధ్యాత్మిక వేత్త , గురువు శంక‌రాచార్య అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీకి బిగ్ షాక్ త‌గిలేలా వ్యాఖ్యానించ‌డం విశేషం. ప్ర‌స్తుతం స్వామీజీ చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి.

ఆయ‌న అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న గెలవ‌డం వ‌ల్ల ప్ర‌ధాన‌మంత్రికి మేలు చేకూరుతుందేమో కానీ భార‌త దేశానికి మాత్రం ఏ మాత్రం ల‌బ్ది చేకూర‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ట్రంప్ తో మోడీకి వ్య‌క్తిగ‌త సంబంధం అనేది ఉండ‌వ‌చ్చు. కానీ ఇది జాతీయ‌ప‌రంగా ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌న్నారు. గ‌తంలో ట్రంప్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో భార‌త దేశానికి ఆయ‌న నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ లేద‌ని మ‌రోసారి గుర్తు చేశారు శంక‌రాచార్య అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంపై పున‌రాలోచించాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీని కోరారు.