NEWSTELANGANA

ప్ర‌శ్నిస్తే కేసులు న‌మోదు చేస్తే ఎలా..?

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నిస్తే కేసులు న‌మోదు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని ఆరోపించారు. సోమ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అప్రజాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌త్యేకించి క‌క్ష సాధింపు, ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఓ వైపు ప్రజా పాల‌న సాగిస్తున్నామంటూ చెబుతూ మ‌రో వైపు కేసులు న‌మోదు చేయ‌డం, దాడుల‌కు తెగ‌బ‌డ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి.

ప్ర‌శ్నించ‌డం అనేది ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌ధాన‌మైన హ‌క్కు అని, ఇది భార‌త రాజ్యాంగం క‌ల్పించింద‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు . అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం మానుకోవాల‌ని సూచించారు త‌న్నీరు హ‌రీశ్ రావు. కొణ‌తం దిలీప్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నామ‌ని, వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.