లక్షల కోట్ల భూములు అదానీ పరం
నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే
మహారాష్ట్ర – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై, మరాఠా ఎన్డీయే సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పాల్ఘర్ లో జరిగిన బహిరంగ సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు.
ముంబయిలో రూ.లక్ష కోట్ల విలువైన భూములను కూడా గౌతమ్ అదానీకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్. తర తరాలుగా ఇక్కడ ధారవి ఉందని, దీనిని కూడా అదానీ పరం చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఖర్గే.
దేశంలోని అమూల్యమైన వనరులు, ఏళ్ల తరబడి నిర్మితమయ్యాయని అన్నారు , అది PSUలు, ప్రభుత్వ కర్మాగారాలు, విమానాశ్రయం, ఓడరేవు, బొగ్గు గనులు, చమురు వాయువు క్షేత్రాలు అన్నింటినీ బడా బాబులకు ప్రధానమంత్రి మోడీ కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అంతే కాకుండా ధారవిలోని భూమి అన్నింటిని మోదీ తన స్నేహితుడికి బదిలీ చేయడం దారుణమన్నారు మల్లికార్జున్ ఖర్గే.
ప్రజల రుణాలను మాఫీ చేయడానికి, వారు తమ ఇల్లు, కారు, భూమి, ఆటో మొదలైన వాటిని తనఖాగా ఉంచుతారు కానీ లక్షల కోట్లు దిగ మింగిన వారికి సంబంధించి ఎలా రుణాలను మాఫీ చేస్తారంటూ ప్రశ్నించారు.