NEWSANDHRA PRADESH

వైసీపీ హ‌యాంలో క్రైమ్ రేట్ ఎక్కువ

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింద‌ని ఆరోపించారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో
శాంతిభద్రతల అంశంపై ఎమ్మెల్సీలు వరూధు కళ్యాణి, కల్పలతా రెడ్డి, యేసు రత్నం ప్రశ్నలకు హోంమంత్రి స‌మాధానం చెప్పారు.

2014 టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే గత ఐదేళ్లలో జరిగిన నేరాలు, ఘోరాలు ఎక్కువేన‌ని అన్నారు.
2014-19 కాలంలో 83, 202 కేసులు నమోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో 1,00508 నేరాలు నమోదు అయిన‌ట్లు తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌.

28.8 శాతం వైసీపీ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ ఎక్కువగా జ‌రిగింద‌న్నారు. అయితే ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక 111 రోజుల‌లో 14,600 కేసులు మాత్ర‌మే న‌మోదయ్యాయ‌ని తెలిపారు హోం మంత్రి.
గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందనడానికి గణాంకాలే నిదర్శనం అన్నారు.

ఐదు నెలల పాలనలో మహిళలు, చిన్నారుల రక్షణే ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకు వ‌చ్చింద‌ని చెప్పారు. మహిళల కోసం హెల్ప్ డెస్క్ లు, దిశ పోలీస్ స్టేషన్లను మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లుగా మార్పు చేశామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో మహిళా సిబ్బంది ద్వారా అవసరమైన సాయం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. పోలీస్ బృందాల బలోపేతం, షీ టీమ్ లు, బ్లూకోర్ట్స్, రక్షక టీమ్ లు, గస్తీ వాహనాలను అప్రమత్తంగా ఉంచడం చేస్తున్నామ‌న్నారు.

పోలీస్, ఐసీడబ్ల్యూ, బాలల సంక్షేమం, రైల్వే, బీఎస్ఎఫ్, న్యాయ శాఖల సమన్వయంతో పోస్కో, మిస్సింగ్ కేసుల నివారణపట్ల ప్రత్యేక దృష్టి పెట్టామ‌న్నారు. సైబర్ క్రైమ్ బృందాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టామ‌ని తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌.

రాష్ట్రానికి మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లే ఉండగా..జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామ‌ని , నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం సీసీ కెమెరాలను పున‌రుద్ద‌రించ‌డం జ‌రిగింద‌న్నారు.