గంజాయి నియంత్రణకు టాస్క్ ఫోర్స్
ఏర్పాటు చేశామన్న పయ్యావుల కేశవ్
అమరావతి – ఏపీ రెవన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన సభ సాక్షిగా గంజాయిపై స్పందించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గంజాయి నియంత్రణకు తమ కూటమి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు.
గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు పయ్యావుల కేశవ్. ఇది తమ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. అంతే కాకంఉడా ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఉచితంగా బాగ్స్, పాఠ్య పుస్తకాలు గత వైకాపా ప్రభుత్వం రద్దు చేస్తే, తాము మళ్ళీ పునరుద్దరించామని చెప్పారు.
పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని మళ్ళీ అమలు చేస్తున్నామని ప్రకటించారు పయ్యావుల కేశవ్. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, స్కాలర్ షిప్ లు వీటన్నిటిని కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూప దీప నైవేద్యాలకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం రూ.10,000 ఇస్తుందన్నారు. అర్చకులకు పదివేల నుంచి రూ.15,000 లకు పెంచడం జరిగిందన్నారు.