NEWSTELANGANA

కాంగ్రెస్ ను గెలిస్తేనే హామీల అమ‌లు

Share it with your family & friends

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన సీఎం ఉన్న‌ట్టుండి మాట మార్చ‌డం విస్తు పోయేలా చేసింది. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తమ పార్టీని గెలిపిస్తేనే ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌గ‌ల‌మ‌న్నారు.

బీజేపీని, మోదీని కాంగ్రెస్ మాత్ర‌మే ఆప గ‌ల‌ద‌న్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టే ఘనత బీజేపీ సాధించిందని అన్నారు. తాను ఎక్క‌డికీ వెళ్ల‌డం లేద‌ని , ఎవ‌రు కోరినా అపాయింట్ మెంట్ ఇస్తాన‌ని అన్నారు . చివ‌ర‌కు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కోరితే వాళ్ల‌కు కూడా ఛాన్స్ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

అభ్యర్థులను నిర్ణయించే అధికారాలన్నీ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీలకు అప్పగిస్తూ టీ కాంగ్రెస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని చెప్పారు. లోక్‌సభకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంద‌ని తెలిపారు. లోక్‌సభ స్థానాలకు మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చ‌ని, పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.