టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్ల ఆవిష్కరణ
ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) స్థానిక ఆలయాల క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావుతో కలిసి ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి, తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి, కార్వేటిన గరం శ్రీ వేణుగోపాల స్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి మూల మూర్తులు, ఉత్సవ మూర్తులతో కూడిన క్యాలెండర్లను టీటీడీ అత్యద్భుతంగా రూపొందించి ముద్రించింది. ఈ క్యాలెండర్లు నవంబర్ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు టీటీడీ చైర్మన్.
శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని కోరారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి హెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.