NEWSNATIONAL

యుకేతో భార‌త్ బంధం బ‌లోపేతం

Share it with your family & friends

పీఎంతో భేటీ అయిన న‌రేంద్ర మోడీ

బ్రెజిల్ – బ్రెజిల్ లోని రియో డి జెనీరో వేదిక‌గా కీల‌క‌మైన జి 20 ప్ర‌పంచ స‌ద‌స్సు జ‌రుగుతోంది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో పాటు భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్, సౌత్ కొరియా చీఫ్ , ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి జార్జియా మెలోనీతో ములాఖ‌త్ తో పాటు యుకే పీఎం కైర్ స్టార్మ‌ర్ తో ములాఖ‌త్ అయ్యారు.

భారతదేశానికి బ్రిట‌న్ తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి మోడీ. రాబోయే సంవత్సరాల్లో తాము సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాలలో సన్నిహితంగా పని చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నామని ప్ర‌క‌టించారు. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలకు మ‌రింత బలాన్ని జోడించాలనుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు .

ఈ సంద‌ర్బంగా యుకే ప్ర‌ధాన‌మంత్రి కైర్ స్టార్మ‌ర్ ను క‌లుసుకున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ. ఇదే స‌మ‌యంలో ఇట‌లీ పీఎం జార్జియా మెలోనిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్ర‌ధానమంత్రి. త‌మ చర్చలు రక్షణ, భద్రత, వాణిజ్యం , సాంకేతికతలో సంబంధాలను మరింతగా పెంచు కోవడంపై కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొన్నారు.