మహిళా సంఘాలకు ఖుష్ కబర్
బలోపేతం చేస్తామన్న సీఎం రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో మహిళా సంఘాలకు మహర్దశ పట్టనుంది. సంఘాల బలోపేతానికి సర్కార్ ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని , వారిని మరింత చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, పోలీసుల విద్యార్థులకు యూనిఫాం కుట్టించే పనిని మహిళా సంఘాలకే అప్పగించాలని సీఎం సూచించారు. అవసరమైతే మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణ అందించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.
గ్రామాల్లో రోడ్ నెట్ వర్క్‌ను అభివృద్ధి చేయాలని, అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదని అధికారులు సీఎంకు వివరించారు.
గ్రామాల్లో నల్లా రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. రహదారుల అభివృద్ధి పనులకు అవసరమైతే ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానం చేస్తామన్నారు. కొత్త బడ్జెట్‌లో నిధుల అవసరానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.