NEWSANDHRA PRADESH

ఆక్వా రంగం అభివృద్దికి స‌ర్కార్ కృషి

Share it with your family & friends

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి – ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త వైసీపీ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కావాల‌ని ఆక్వా రంగాన్ని నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. దీంతో దీనిపై ఆధార‌ప‌డిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఈ విష‌యంపై త‌మ కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా దృష్టి సారించింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా త‌మ స‌ర్కార్ ప్ర‌స్తుతం ఆక్వా రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వి కుమార్. ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

ఆక్వా రంగానికి రాయితీలు ప్రకటించిన ఘనత చంద్రబాబు నాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు. గ‌త వైసీపీ ప్రభుత్వం అర్థంలేని మూడు జీవోలు ఇచ్చి ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు గొట్టిపాటి ర‌వి కుమార్.

టీడీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు సమానంగా రాయితీలను అందించిందని అన్నారు. వైసీపీ రాయితీని రూ.2 నుంచి రూ. 1.5 తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను 30 శాతానికి కుదించిందని ఆరోపించారు.ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ ల పేరుతో రైతులను దగా చేసిందని మండిప‌డ్డారు. వైసీపీ చేసిన ఘనకార్యం కారణంగా రూ.1990 కోట్ల భారాన్ని డిస్కంలు భరించాల్సి వచ్చింద‌న్నారు.