రేవంత్ రెడ్డితో సంగీతా రెడ్డి భేటీ
మర్యాద పూర్వకంగా కలిశా
హైదరాబాద్ – దేశంలో పేరు పొందిన అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కొద్ది సేపు వివిధ అంశాలపై చర్చించారు.
డాక్టర్ సంగీతా రెడ్డి ఆధ్వర్యంలో అపోలో ఆస్పత్రులు నడుస్తున్నాయి. వివిధ రోగాలకు సంబంధించి మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. అయితే నూతన సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డితో గతంలో కూడా పరిచయం ఉంది. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో కూడా గతంలో పని చేశారు రేవంత్ రెడ్డి.
ఆయనకు అన్ని పార్టీలు, వర్గాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలతో , యజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సిఇఓలో సత్ సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రతి ఒక్కరికీ పూర్తిగా హెల్త్ డిజిటల్ కార్డు ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం. దీనిని నిర్వహించేందుకు ఆయా ఆస్పత్రులు , సంస్థలు ముందుకు రావాలని కోరారు.