పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు తొలగింపు
ఉత్తర్వులు జారీ చేసిన గుంటూరు జడ్జి
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ సందర్బంగా కోర్టులో విచారణకు వచ్చింది. పవన్ కళ్యాణ్ క్రిమినల్ కాదని, ఆయనపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది కోర్టు.
ఈ మేరకు క్రిమినల్ కేసును తొలగిస్తున్నట్లు ప్రకటించారు గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్. శరత్ బాబు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు వాలంటీర్లపై.
వారంతా రాష్ట్రంలో అసాంఘిక శక్తులుగా మారారని, మహిళలు మిస్సింగ్ కావడానికి వారే కారణమంటూ పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇదిలా ఉండగా జూలై 29, 2023న గుంటూరుకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో.
కాగా ఈ కేసుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో తమపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయలేదంటూ వాలంటీర్లు చెప్పారు కోర్టులో. దీంతో పవన్ కళ్యాణ్ ఉత్తముడంటూ పేర్కొన్నారు జడ్జి.