ఎన్నికల వేళ మరాఠాలో నోట్ల కలకలం
భారతీయ జనతా పార్టీ నేతపై కేసు
మహారాష్ట్ర – ఎన్నికల వేళ మహారాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత వినోద్ తావ్డేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన డబ్బులు పంచుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం విశేషం.
రెండు ఎఫ్ఐఆర్ లలో బీజేపీ అభ్యర్థి పేరు ఉండగా ఇంకో ఎఫ్ఐఆర్ లో వినోద్ తావ్డే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా మొత్తం నగు 9 లక్షల 53 వేల 900 రూపాయలు దొరికాయి. తులింజ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఈసీ ఆరా తీస్తోంది.
కాగా వినోద్ తావ్డే , రాజన్ నాయక్ మధ్య జరిగిన సమావేశంలో బహుజన్ వికాస్ అఘాడి (BVA) కార్మికులు పాల్ఘర్‌లోని వివాంతా హోటల్‌లోకి దూసుకెళ్లారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు బీజేపీ నేత ఖండించారు. ఇదంతా ప్రత్యర్థులు ఆడుతున్న నాటకం అని ఆరోపించారు. కాగా మరాఠాలో ఈనెల 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
పాల్ఘర్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను ప్రాంతీయ పార్టీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు.