NEWSTELANGANA

సీఎంను క‌లిసిన కృష్ణ‌య్య‌

Share it with your family & friends

బీసీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

హైద‌రాబాద్ – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య స‌భ స‌భ్యుడు ఆర్. కృష్ణ‌య్య డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం త‌ర‌పున విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు.

బీసీ కుల గ‌ణ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్ట‌లేద‌ని, వెంట‌నే ఇచ్చిన హామీ మేర‌కు స‌ర్వే చేయించాల‌ని కోరారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన మేర‌కు సిబ్బందిని నియ‌మించి, త్వ‌రిత‌గ‌తిన నియామ‌క ప్ర‌క్రియ వేగవంతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం నిరీక్షిస్తున్నార‌ని , వారి ఆశ‌ల‌పై గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లింద‌ని ఆరోపించారు. ఇక‌నైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వం జాబ్స్ భ‌ర్తీపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు ఆర్. కృష్ణ‌య్య‌. ప్ర‌ధానంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు అత్య‌ధిక శాతం రాజ‌కీయ చైత‌న్యం లేకుండా పోయింద‌న్నారు.