NEWSINTERNATIONAL

డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊర‌ట

Share it with your family & friends

మ‌నీ నేరారోప‌ణ‌ల కేసు వాయిదా
అమెరికా – అమెరికా దేశ నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊర‌ట ల‌భించింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ట్రంప్ పై ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో భారీ మెజారిటీతో గెలుపొందారు.

తాజాగా డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి హుష్ మ‌నీ నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది కోర్టులో. విచార‌ణ అనంత‌రం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ నేరారోప‌ణ కేసుకు సంబంధించిన విచార‌ణ తేదీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు డొన‌ల్డ్ ట్రంప్.

కాగా వ్యాపార రికార్డులను తప్పు దోవ పట్టించే 34 నేరారోపణలకు సంబంధించి ట్రంప్‌కు విధించిన శిక్షను సమర్థించాలా లేదా తిరస్కరించాలా అని న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ తీర్పు ఇస్తారని భావిస్తున్నందున ఈ అద్భుతమైన చర్య రావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు సంచ‌ల‌న నిర్ణ‌యాలకు తెర లేపారు అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్. అక్ర‌మంగా దేశంలో కొలువు తీరిన వ‌ల‌స‌దారుల‌ను ఏరి వేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.