సీఎంకు బార్ కౌన్సిల్ కంగ్రాట్స్
సమస్యలు పరిష్కరించాలని విన్నపం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన బార్ కౌన్సిల్ సభ్యులు మర్యాద పూర్వకంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు సీఎంను సన్మానించారు. అనంతరం తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తాము గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్బంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతంలో కేటాయించారు. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదలైంది. హైకోర్టును అక్కడ నిర్మించనున్నారు. సువిశాలమైన కోర్టు తో పాటు జడ్జీలు ఉండేందుకు భవనాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. జడ్జి కోరిన కోర్కెలన్నింటినీ తీర్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఫుల్ ఖుష్ అయ్యారు జడ్జి. అయితే నగరం నడిబొడ్డున ఉన్న హైకోర్టును తరలించ వద్దంటూ పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం అవుతోంది. ఏబీవీపీ నాయకురాలిపై ఖాకీల దాష్టీకం ఇప్పుడు వైరల్ గా మారింది.