సీఎంతో యశస్విని రెడ్డి భేటీ
నియోజకవర్గ అభివృద్దికి నిధులివ్వండి
హైదరాబాద్ – పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆమె సీఎంతో నియోజకవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే తమ సంస్థ నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజలకు ఉపయోగ పడేలా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.
ప్రత్యేకించి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా నైపుణ్యాభివృద్ది మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం అభినందనీయమని ప్రశంసించారు.
సర్కార్ పరంగా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసినట్లయితే మరింతగా అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా యశస్విని రెడ్డి తో పాటు ఆమె అత్త కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్బంగా సీఎం పాలకుర్తి ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో యశస్విని రెడ్డి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.