సీఎం రాక బడులు మూత – బీఆర్ఎస్
డీఈవో ఉత్తర్వులు జారీపై ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. బుధవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటన ఉందనే నెపంతో ప్రభుత్వ, ప్రైవేట్ బడులను బంద్ చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించింది. ఓ వైపు టీచర్లు లేక, కనీస వసతులు అందక, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యా సంవత్సరం పూర్తయ్యే సమయం ముంచుకు వస్తోందని తెలిపింది.
సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారంటూ ప్రైవేట్ బడులు బంద్ చేయించి బస్సులు పెట్టిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. విచిత్రం ఏమిటంటే డిసెంబర్ రెండవ శనివారం రోజు వర్కింగ్ డే గా స్కూల్ నడిపించమని డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మండి పడింది. ఒక బాధ్యత కలిగిన విద్యాశాఖాధికారి ఇలా ఎలా ఉత్తర్వులు ఇస్తారంటూ ప్రశ్నించింది.
సీఎం వస్తే స్కూళ్లు మూయడం ఏమిటి..సభకు, చదువుకు లింకు ఏమిటో చెప్పాలంటూ బీఆర్ఎస్ నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ చేసే నిర్వాకానికి విద్యార్థులు బలవ్వాలా అని మండిపడింది.