మీ ఓటు అభివృద్దికి మలుపు – సీఎం
బీజేపీకి వేస్తే పెట్టుబడిదారులకు వేసినట్టే
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో నవంబర్ 20న బుధవారం శాసన సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఇరు రాష్ట్రాల ప్రజలకు మహా వికాస్ అఘాడీకి, ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఎక్స్ వేదికగా అనుముల రేవంత్ రెడ్డి మరాఠా ప్రజలకు మీ విలువైన ఓటును మహా వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు . రాబోయే 5 సంవత్సరాలలో మీ భవితవ్యాన్ని నిర్ణయించుకోవడానికి ఈ రోజు అత్యంత కీలకమైన రోజు అని అభివర్ణించారు సీఎం.
మహారాష్ట్ర ప్రగతి పథంలోకి తిరిగి వస్తుందా లేదా బీజేపీ నేతృత్వంలోని మహాయుత అవినీతి, దుష్పరిపాలన, విభజన రాజకీయాల కారణంగా మరింత అవమానాన్ని ఎదుర్కొంటుందా అనేది తేల్చాల్సింది మీరేనంటూ స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీ కోసం పనిచేసే ప్రభుత్వం వస్తుందన్నారు. రైతులు, యువత, మహిళలు, వెనుకబడిన, అణగారిన వర్గాల. తాము ఇచ్చిన హామీలు సమాజంలోని ప్రతి విభాగానికి జరిగిన అన్యాయాన్ని రద్దు చేస్తాయన్నారు. ప్రతి ఒక్కరికీ స్థిరమైన, ప్రజల-కేంద్రీకృత ప్రభుత్వాన్ని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి.