NEWSANDHRA PRADESH

ఒకే కుటుంబం ఆధీనంలో విశాఖ డెయిరీ

Share it with your family & friends

ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు
అమ‌రావ‌తి – విశాఖ డెయిరీ లో అంతులేని అవినీతి , అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు శాస‌న స‌భ వేదిక‌గా ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు. రైతుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులను ఎన్నికల ఖర్చులకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.

రూ. 300 చొప్పున పాడి రైతుల నుంచి వసూలు చేసి, చెన్నై, బెంగుళూరులలో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నార‌ని భ‌గ్గుమ‌న్నారు. సీఐడీ లేదా జ్యూడీషియ‌ల్ క‌మిటీ లేదా హౌస్ క‌మిటీ ద్వారా విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు .

విశాఖ డెయిరీ యాజమాన్యంపై కఠిన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. విషయం ఎక్కడికి వెళ్లినా, పాల సేకరణ, మార్కెటింగ్, డైరక్టర్ల నియామకాల వరకు అన్నీ ఒకే కుటుంబం ఆధీనంలో ఉండి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.

రైతుల సంక్షేమం కోసం కేటాయించిన భూములు, నిధులు అన్నీ అక్రమ మార్గాల్లో ఉపయోగించారని, విపరీతంగా బినామీ వ్యవస్థతో డెయిరీ ఆస్తులను మటు మాయం చేశారంటూ ఫైర్ అయ్యారు.